‘పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు’
కౌటాల(సిర్పూర్): రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాలలో ఇందిరమ్మ నమూనా గృహా నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి భూమిపూజ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియని తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. అధికారులు పకడ్బందీగా అర్హులైన వారిని గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, మాజీ ఎంపీపీలు బసర్కార్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, టీపీసీసీ సభ్యుడు అర్షద్ హుస్సేన్, బీజేపీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు కుంచాల విజయ్, డీఈ వేణుగోపాల్, ఎంపీడీవో కోట ప్రసాద్, నాయకులు మల్లయ్య, మోతీరాం, చందు, శ్రీవర్థన్, తిరుపతి, సంతోష్, రవీందర్‌గౌడ్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయాలి
సిర్పూర్(టి): రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నా రు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా సర్వే చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, డీఈ వేణుగోపాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment