నేటి నుంచి గ్రామ సభలు
ఆసిఫాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే నాలుగు రోజులపాటు కొనసాగింది. ఈ క్రమంలో మంగళవారం నుంచి గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంగళవారం నుంచి విడతలవారీగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ప్రాథమిక జాబితా ప్రకారం లబ్ధిదారుల వివరాలను అధికారులు చదివి వినిపిస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 26 తుది జాబితా ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు సంక్షేమ పథకాలపై సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేని వారికి సైతం మంగళవారం నుంచి నిర్వహించే గ్రామసభల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు ఆర్‌బీఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రంగాల్లో రిక్రూట్‌మెంట్ ఫౌండేషన్ కోర్సుకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వె నుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సజీ వన్, బీసీ స్టడీ సర్కిల్(ఆదిలాబాద్) సంచాలకుడు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి నాలుగు నెలలపాటు ఉచిత శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు రూ.1,50,000, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షల లోపు ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9లోగా https://tgbcstudy circle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. వివరాలకు 08732– 221280 నంబర్‌ను స్రందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment