ఆర్టిజన్ల రిలే నిరాహార దీక్షలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం ఎదుట సోమవారం విద్యుత్‌శాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టీవీఏసీ జేఏసీ జిల్లా చైర్మన్ మారుతి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో సర్వీసు రీల్స్‌లో ఐదేళ్లు పూర్తిచేసిన ఆర్టిజన్లకు జీవో 308 ప్రకారం అపాయింట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ ప్రకారం కన్వర్షన్ కల్పించాలని డిమాండ్ చేశా రు. విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే నిబంధన వర్తింపజేయాలన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిరసన కార్యక్రమాలు చే పట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నసీరుద్దీన్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు వామన్, బుచ్చిబాబు, కోశాధి కారి ఏకాంబరం, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment