ఘనంగా గణతంత్ర వేడుకల నిర్వహణ
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: జిల్లాలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు క లెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఈ నెల 24 వరకు ప్రశంసా పత్రాలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 26న ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాల ని, అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించనున్న నేపథ్యం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. ప్రశంసా పత్రాలు, శకటాల ప్రదర్శన, స్టాళ్ల ఏర్పాటు, ప్రసంగ ప్రతి, దేశభక్తి గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పనులను పర్యవేక్షించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఆహ్వా నం, ప్రశంసా పత్రాల పంపిణీ, ఎస్పీ ఆధ్వర్యంలో మినట్ టు మినట్ కార్యక్రమం, పతాకావిష్కరణ, అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ హో స్టింగ్, ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ ఆ ధ్వర్యంలో వేదిక అలంకరణ, పుష్పగుచ్ఛాలు, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేదిక అ లంకరణ, పుష్పగుచ్ఛాలు, డీఆర్‌డీఏ, పంచా యతీ రాజ్ ఈఈ ఆధ్వర్యంలో వేదిక తయారీ, టెంట్, కుర్చీలు, సౌండ్ సిస్టం, మైక్‌ఏర్పాట్లు, జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ, మీడియా నిర్వహణ, తహసీల్దార్ ఆధ్వర్యంలో పతాకం, ఫ్లెక్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల సన్మానానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment