జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ మున్సి పాలిటీ ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా నేటివరకు కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కార్మికుల వద్దకు చేరుకుని మాట్లాడారు. నెల రోజుల్లోగా జీవో 60 ప్రకా రం 144 మంది కార్మికులకు వేతనాలు చెల్లి స్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని కార్మికులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు మాట్ల రాజు, కార్యదర్శి శ్రీకాంత్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, నాయకులు కృష్ణమాచారి, ప్రభాకర్, దుర్గాప్రసాద్, లక్ష్మి, సంధ్య, పెంటుబాయి, బాలేష్, జగదీష్, నరేశ్, శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment