రేషన్ షాపులు ఏర్పాటు చేయాలి
కాగజ్‌నగర్‌రూరల్: మారుమూల గిరిజన గ్రామాల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మండలంలోని ఉట్‌పల్లి, రేగులగూడ గ్రామాల్లో సోమవారం పర్యటించారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని చెబుతున్నా.. ఇప్పటికీ ఆదివాసీ ప్రాంతాల్లో షాపులు లేవన్నారు. కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు లేక పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రేషన్‌షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, రాంప్రసాద్, వాసు, కిశోర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment