![ఎమ్మెల్సీ ఎన్నికలకు 17 కేంద్రాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06asb56-340109_mr-1738870793-0.jpg.webp?itok=m828pwWv)
ఎమ్మెల్సీ ఎన్నికలకు 17 కేంద్రాలు
● ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల కోసం జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 17 పోలింగ్ కేంద్రాల పరిధిలో 416 మంది ఉపాధ్యాయులు, సుమారు ఆరు వేల మంది పట్టభద్రులు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నియమావళి పకడ్బందీగా అ మలు చేయాలన్నారు. నిబంధనల ప్రకారం రాజకీ య పార్టీలకు సంబంధించిన హోర్డింగ్‌లు, గోడప్రతులు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నిశితంగా పరిశీలి స్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ నెల 27న జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించేవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. నోడల్ అధికారులు వారికి కేటాయించిన పనులు బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment