![లక్ష్య సాధనకు సమన్వయంతో పని చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06asb58-340109_mr-1738870793-0.jpg.webp?itok=yAeqFVi3)
లక్ష్య సాధనకు సమన్వయంతో పని చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: యాసంగి సీజన్‌లో కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్య సాధనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సంచాలకులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా అదనపు కలెక్టర్లు(రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2024– 25 యాసంగి సీజన్‌లో సీఎంఆర్ లక్ష్య సాధనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ట్యాగింగ్ కలిగిన రైస్ మిల్లులకు సామర్థ్యానికి అనుగుణంగా తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం సేకరణకు చర్యలు చేపడతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment