![‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06asb76-340003_mr-1738870794-0.jpg.webp?itok=CgWga5G0)
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉ త్తమ ఫలితాలు సాధించాలని అదనపు కలెక్టర్ దీప క్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తూ, వారి సందేహాలు నివృత్తి చేయాలన్నారు. ఎంఈవోలు ప్రతిరోజూ ఐదు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల బోధన సరళిని సమీక్షించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులకు సూచించారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ బాబు, ఎస్‌వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్‌మెంట్(టాస్క్) కేంద్రంలో అందించే శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్‌ను గురువారం డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి సందర్శించారు. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఏకాగ్రతతో శిక్షణ అంశాలను నేర్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment