![‘హామీలు అమలు చేయడంలో విఫలం’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06asb54-340109_mr-1738870794-0.jpg.webp?itok=ZulYhQ4h)
‘హామీలు అమలు చేయడంలో విఫలం’
ఆసిఫాబాద్‌అర్బన్: సెకండ్ ఏఎన్‌ఎంలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అంజూమ్‌కు సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ గతేడాది సెకండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తున్న సమయంలో సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సెకండ్ ఏఎన్‌ఎం పోస్టులు పెంచాలని, వందశాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దివాకర్, సెకండ్ ఏఎన్‌ఎం జిల్లా జాయింట్ సెక్రెటరీ ప్రమీల, సిబ్బంది వనిత, పద్మ, జ్యోతి, సత్యవాణి, రాజేశ్వరీ, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment