No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Oct 20 2024 3:18 AM | Last Updated on Sun, Oct 20 2024 3:18 AM

No Headline

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎముకల గూడే మనిషి నిర్మాణంగా రూపుదిద్దుకుటుంది. వడివడిగా అడు గులు పడాలన్నా, చకచకా పనులుసాగాలన్నా ఎముకలే కీలకం. మారుతున్న జీవన విధానం, ఆహార అలవాట్లు ఎముకల పటుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే శతాబ్దం పాటు సేవలు అందించాల్సిన ఎముకలు నడివయస్సులోనే సత్తువ కోల్పోతున్నాయి. ఎముకలు గుల్లబారడం (ఆస్టియో ఫోరోసిస్‌) ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మడి కృష్ణాలో లక్ష మందికిపైనే బాధితులు

పటుత్వం తగ్గి ఎముకలు విరుగుతున్న వారితో పాటు, ఆస్టియో ఫోరోసిస్‌ వ్యాధికి గురైన వారు ఉమ్మడి కృష్ణాలో లక్ష మంది వరకూ ఉన్నట్లు అంచనా. ప్రభుత్వాస్పత్రికి రోజూ ఇలా ఎముకలు విరిగిన వారు ఐదారుగురు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్న వారు ఇటీవల ఎక్కువగానే ఉంటున్నారు. ఇటీవల వెన్నునొప్పి, మెడ ఎముక నొప్పి, తుంటె ఎముక విరగడం వంటి సమస్యలతో అత్యధిక శాతం మంది ఇబ్బంది పడుతున్నారు.

శారీరక శ్రమ లేకనే..

ఒకప్పుడు పిండి రుబ్బడం, దుస్తులు ఉతకడం, బావినీళ్లు చేదడం వంటి ఇంటి పనులతో మహిళలకు వ్యాయామం లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రైండర్లు, వాషింగ్‌ మెషిన్లు రావడంతో శారీరక వ్యాయామం తగ్గింది. మగవారిలో సైతం వాహనాల వినియోగం పెరగడం, ఆ వాహనాలకు ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ బటన్‌లు రావడంతో ఏ మాత్రం వ్యాయామం ఉండటం లేదు. ఏసీలు వినియోగం పెరగడం, శరీరానికి సూర్యకిరణాలు తగలకపోవడం వంటి కారణాలతో ఎముకల్లో సాంద్రత తగ్గిపో తోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఆస్టియో ఫోరోసిస్‌ వల్ల ఎముకలు విరిగేవి. ఇప్పుడు చిన్న వయ స్సులోనే ఎముకలు పటుత్వం కోల్పోతున్నాయి.

మహిళల్లోనే అధికంగా..

సగటు మహిళకు రొమ్ము, అండాశయ, గర్భకోశ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కంటే బోలు ఎముక (ఎముక పటుత్వం తగ్గడం) వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. సీ్త్ర అండాశయంలో ఈస్ట్రోజన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్‌ ఎముక కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. తగినంత శారీరక వ్యాయామం లేకపోవడంతో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి తగ్గి ఎముక కణాలు క్షీణించి బోలుగా మారుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. బహిష్టు ఆగిన వారిలో ఐదేళ్లలో ఎముక సాంద్రత 20 శాతం తగ్గుతుందని వివరిస్తున్నారు.

పటుత్వం తగ్గడానికి కారణాలు ఇవీ..

● ఆహారంలో తగు పాళ్లలో కాల్షియం, విటమిన్‌ డీ, ప్రొటీన్లు లోపించడం.

● నిశ్చల జీవనశైలి(శారీరక శ్రమ లేక పోవడం), మద్యపానం, ధూమపానం.

● అధికంగా కాఫీ, శీతల పానీయాలు తాగడం.

● అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌ వాడటం.

● మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement