మద్దతుకు ప్రాధాన్యం ఏదీ?
పెడన: రైతుల ఆరుగాలం కష్టం ఫలించింది. ధాన్యం దిగుబడులు చేతికి వస్తున్నాయి. పంట దిగుబడులు సైతం ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. సాధారణ రకం 75 కిలోల బస్తాకు రూ.1,725, గ్రేడ్ ఏ రకానికి రూ.1,740 చొప్పున కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. వరికోతలు మొదలై ధాన్యం రైతుల ఇళ్లకు చేరుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభంచలేదు. ఎప్పటికి ప్రారంభించేదీ ప్రకటించలేదు. అప్పులు చేసి వ్యవసాయ పెట్టుబడులకు వెచ్చించిన రైతులు పంటను విక్రయించి బాకీలు తీర్చాలని భావిస్తున్నారు. వారి అవసరాను ఆసరాగా తీసుకున్న కొందరు మిల్లర్లు, దళారులు మద్దతు ధరను కొండెక్కించారు. బీపీటీ రకం 75 కిలోల బస్తాను రూ.1,400 నుంచి రూ.1,500కు మించి కొనుగోలు చేసేది లేదని తేల్చిచెబుతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నాయి. ఫలితంగా ధాన్యానికి గిట్టుబాటు ధర లభించింది. ధాన్యాన్ని రైతులు గట్టుమీదకు చేర్చడమే తరువాయి బస్తాకు రూ.1600 నుంచి రూ.2 వేల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ దఫా ఖర్చులు బాగా పెరిగాయని, మద్దతు ధర కూడా లేకపోతే నష్టాలు తప్పవని పేర్కొంటున్నారు.
బస్తా ధర రూ.1,600 నుంచి రూ.1,400కు పడిపోయిన వైనం వైఎస్సార్ సీపీ పాలనలోరూ.1,600 నుంచి రూ.2 వేల ధర రైతులు నష్టపోతున్నా తెరుచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
Comments
Please login to add a commentAdd a comment