పెడన నియోజకవర్గంలో వరి కొతలు మొదలయ్యాయి. అయినా పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. డీసీఎంఎస్ ద్వారా 23 కేంద్రాలు, పీఎసీఎస్‌లు 31, రెండు ఎఫ్‌పీఓల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొంటూ వ్యవసాయశాఖ అధికారులు కరపత్రాలు, ఫ్లెక్సీలు ముద్రించి ఆయా కేంద్రాలకు పంపించారు. సిబ్బందిని నేటి వరకు వాటిని ప్రదర్శించడంలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవ డంతో దళారులు తక్కువ ధరలకు ధాన్యం కొంటున్నారు. రైతులు మద్దతు ధర అడిగితే అంత మొత్తం తాము ఇవ్వలేమంటూ తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో చేసేది లేక రైతులు ధాన్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లి ఆరబెట్టుకుంటున్నారు. అప్పుల ఒత్తిడి ఉన్నవారు వచ్చిన ధరకే ధాన్యాన్ని తెగనమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment