పీహెచ్‌సీల నిర్వహణపై శ్రద్ధ చూపండి
వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ వాకాటి కరుణ
చిలకలపూడి(మచిలీపట్నం): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణపై శ్రద్ధ వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ డాక్టర్ వాకాటి కరుణ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం జెడ్పీ సమావేశ హాలులో కలెక్టర్ బాలాజీతో కలిసి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ఇమ్యునైజేషన్ నూరుశాతం జరుగుతోందని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం గర్భిణులు ఎనిమియా రీడింగ్స్ కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే పటిష్టంగా చేయాలన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ కొత్త పీహెచ్‌సీ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. తొలుత జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు క్లస్టర్ల వారీగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, పరీక్షలు ఆమె పరిశీలించారు. సమావేశంలో రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ గణపతి, డీఎంఅండ్‌హెచ్‌వో గీతాబాయి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
24న ఉమ్మడి కృష్ణాజిల్లా బాడీబిల్డింగ్ జట్టుకు ఎంపికలు
పెనమలూరు: బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనటానికి క్రీడాకారులను ఎంపిక చేస్తామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి ఈ నెల 24వ తేదీన కానూరు అశోక్ జిమ్‌లో జరగనున్న జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86867 71358 ఫోన్‌లో సంప్రదించాలని అన్నారు. సంఘ అధ్యక్షుడు బత్తుల మనోహర్, గోల్డ్ ఫిట్‌నెస్ రాజు పాల్గొన్నారు.
ముగిసిన పోలీస్ స్పోర్ట్స్‌మీట్
ఓవరాల్ విన్నర్‌గా ఏఆర్ టీం
కోనేరుసెంటర్: జిల్లా పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న పోలీస్ స్పోర్ట్స్‌మీట్–2024 పోటీలు బుధవారంతో ముగిశాయి. విజేతలకు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్‌కుమార్ బహుమతులను అందజేశారు. పోటీల్లో కృష్ణాజిల్లా ఏఆర్ టీం ఓవరాల్ విన్నర్‌గా నిలించింది. ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన పోటీలకు జిల్లాలోని అవనిగడ్డ, బందరు, గుడివాడ, గన్నవరం సబ్‌డివిజన్లకు చెందిన పోలీసు సిబ్బంది హాజరయ్యారు. ఏఆర్ టీం ఓవరాల్ విన్నర్‌గా ట్రోఫీ గెలుచుకోగా వాలీ బాల్‌లో గుడివాడ సబ్‌డివిజన్ టీం రన్నర్‌గా నిలిచింది. కబడ్డీలో ఏఆర్ టీం విన్నర్‌గా నిలవగా అవనిగడ్డ సబ్‌డివిజన్ రన్నర్‌గా నిలి చింది. ఎస్పీ ఆర్ గంగాధరరావు, జేసీ గీతాంజలిశర్మ, కార్యక్రమంలో ఏఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ టెన్నిస్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టెన్నిస్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వి.రాకేష్ వెంకటేశ్వరచౌదరి(జీఎస్‌ఎల్ వైద్య కళాశాల, రాజ మండ్రి), జి.విష్ణుసాహిత్ (జీఎస్‌ఎల్ వైద్య కళాశాల, రాజమండ్రి), సి.హెచ్.ప్రభవ్(ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం), సి.హెచ్. జనార్దన్‌సాగర్(సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ), ఎం.శివకుమార్(ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల, చినకాకాని) జట్టులో చోటు దక్కించుకున్నారన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్ కేరళలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment