సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనే
లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బెంజి సర్కిల్‌లోని సంఘం హాల్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత వెసులుబాటు వస్తుందని వాహన యజమానులు అందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రగతి నుంచి వాహన్‌కు డేటా మైగ్రేషన్‌తో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. నాలుగు నెలల నుంచి ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. రవాణాశాఖ, ఎన్‌ఐసీ అధికారులు ఎంత చేసినా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని వివరించారు. దీంతో కొన్ని లారీలు నెలల పాటు ఆగిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వెహికల్ ఈ ప్రగతిలో స్టాపేజీ వేసి తదుపరి వెహికల్ రీ వోకేషన్ పెట్టుకుంటే నాలుగు నెలల నుంచి ఆ పని కాలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాసిన కేసులు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నట్లు ఈశ్వరరావు తెలిపారు. ఇలా అనేక సమస్యలు ఉన్నా యని, ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి స్పందించి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment