గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆడ పశువుల్లో గర్భస్రావానికి, మగ పశువుల్లో కీళ్ల వాపులు, వంధ్యత్వానికి కారణమయ్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్రణకు డిసెంబర్ 15 వరకు బ్రూసెల్లోసిస్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా.. పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ పశువుల నుంచి మనుషులకు సోకే గుణం ఈ వ్యాధికి ఉందని.. పశు వ్యాధుల నియంత్రణ ద్వారా 4 నుంచి 8 నెలల వయసు ఆడ దూడలకు టీకా వేస్తారన్నారు. ఒకసారి టీకా వేస్తే జీవితంలో మరెప్పుడూ వ్యాధి రాదని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్, సీడీవో వెంకటేశ్వరరావు, డాక్టర్ మనోజ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment