విద్యుత్ శాఖ ఎస్‌ఈ మార్లపూడి సత్యానందం
విద్యుత్ శాఖ ఎస్‌ఈ మార్లపూడి సత్యానందం
మచిలీపట్నంటౌన్: భావి తరాల భరోసా కోసం ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని విద్యుత్ శాఖ కృష్ణాజిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ మార్లపూడి సత్యానందం పిలుపునిచ్చారు. ఈ నెల 14నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
విద్యుత్ తయారీకి వినియోగిస్తున్న బొగ్గు, నీరు తగ్గిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫైవ్‌స్టార్, ఐఎస్‌ఐ మార్క్ కలిగిన గృహోపకరణలను, ఎల్‌ఈడీ బల్బులను వినియోగించాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్‌తో ఆపిన తర్వాత స్విచ్‌ను ఆపివేయాలన్నారు. ఒక యూనిట్ విద్యుత్‌ను పొదుపు చేస్తే రెండు యానిట్లను తయారు చేసినట్లు అవుతుందని చెప్పారు.
ఒక్క ఏసీ వినియోగిస్తే 30 ఫ్యాన్‌లను వినియోగించినట్లు విద్యుత్ ఖర్చు అవుతుందన్నారు. జిల్లాలో ఎల్‌టీ విద్యుత్ కనెక్షలు 6,85,769 ఉండగా, హెచ్‌టీ కనెక్షన్‌లు 6,86,126 కనెక్షలు ఉన్నాయన్నారు. లైన్‌ల లాస్‌ను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పీఎం సూర్యఘర్‌ను వినియోగించుకోండి
ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పధకం ద్వారా ఇంటిపై కప్పుపై సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వినియోగదారులకు ప్రభుత్వం రూ.78 వేలను సబ్సిడీగా అందించడంతో పాటు యూనిట్ కాస్ట్‌లో 45 శాతం మేర బ్యాంక్‌లు రుణం ఇస్తాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment