భవానీ దీక్షల విరమణకు పటిష్ట బందోబస్తు
విజయవాడస్పోర్ట్స్: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులు వేచి ఉండే ప్రాంతాలు, కేశ ఖండన శాల, క్యూల రద్దీ, స్నాన ఘాట్లు, ప్రసాదం కౌంటర్లు వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీని కోసం అనువైన ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. భవానీ దీక్షా 2024 యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు గౌతమి సాలి, తిరుమలేశ్వరెడ్డి, ఉమామహేశ్వరరాజు, ఉదయరాణి, ఎస్.వి.డి.ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment