స్వస్థలానికి మావోయిస్ట్ నేత భౌతికకాయం
ఐదుగుళ్లపల్లిలో పృథ్వీ మోహన్‌అంత్యక్రియలు
గూడూరు (పెడన): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సౌత్ అంబుజ్మడ్ ప్రాంతంలోని లకేవేదలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఎస్‌సీఎం ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు, వెస్ట్ బ్యూరో కార్యదర్శి కార్తీక్ దాదా అలియాస్ దస్రు అలియాస్ పృథ్వీ మోహన్‌రావు (65) మృతదేహాన్ని కృష్ణాజిల్లా గూడూరు మండలం ఐదుగుళ్లపల్లికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం ఐదుగుళ్లపల్లిలోని సోదరుడు యోగానందరావు ఇంటికి మార్చురీ అంబులెన్స్‌లో మోహన్‌రావు దేహాన్ని తీసుకొచ్చారు. మోహన్‌రావు మృతదేహాన్ని చూసి కుమార్తె, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజాసంఘాల నేతలు మోహన్‌రావు పార్థివ దేహంపై ఎర్రజెండాలు కప్పి ఘనంగా నివాళులర్పించారు. మోహన్‌రావును స్మరించుకుంటూ విప్లవ గేయాలు ఆలపించారు. అనంతరం గ్రామంలోని శ్మశాన వాటికలో మోహన్‌రావు దేహాన్ని ఖననం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment