రైతుకూలీ సంఘం సావనీర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సామ్రాజ్యవాదుల కబంధహస్తాల నుంచి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం పిలుపునిచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రైతుకూలీ సంఘం రాష్ట్ర మహాసభల సావనీర్ ఆవిష్కరణ సభ జరిగింది. సభకు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబాబు అధ్యక్షత వహించగా, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్ సావనీరును ఆవిష్కరించారు. ఈసందర్భంగా దివికుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో భూమి, నీరు, పెట్టుబడులు, మార్కెట్లను విదేశీ బడా కంపెనీలతో కుమ్మకై ్కన స్వదేశీ కంపెలకు మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. రైతుకూలీ సంఘం సావనీర్‌ను రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర పాలకులు రైతులకు ఇస్తున్న సబ్సిడీలను దాదాపు రద్దు చేశాయని విమర్శించారు. సభలో ఓపిడీఆర్ రాష్ట్ర కార్యదర్శి వి.హనుమంతరావు, సీ్త్ర విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సి.విజయ, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు జె.జగన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment