కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Published Mon, Dec 23 2024 1:47 AM | Last Updated on Mon, Dec 23 2024 1:47 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

7

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలజీ ఆదివారం తెలిపారు.

అన్నదానానికి విరాళం

పెనమలూరు: యనమలకుదురులోని రామ లింగేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదానానికి పెనమలూరుకు చెందిన వెలగపూడి రమేష్‌, రాజేష్‌ రూ. 1,01,116 విరాళంగా అందజేశారు.

బీచ్‌ గేట్లు మూసివేత

కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అటవీ అధికారులు హంసలదీవి సాగరతీరం గేట్లను మూసివేశారు.

వర్సిటీ క్యాంపస్‌లో హాస్టల్‌ వసతి లేదు. గతంలో మంజూరైన పనులు కూడా నిలిచిపోయాయి. కనీసం క్యాంటీన్‌ కూడా లేదు. రోడ్డు మార్గం సరిగా లేదు. దీంతో విద్యార్థులు క్యాంపస్‌లో చేరేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి, పెండింగ్‌ పనులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించని పక్షంలో పోరాటాలు చేస్తాం.

– ఎండీ సాధిక్‌ బాబు,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

సాక్షి, మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ(కేయూ)పై కూటమి ప్రభుత్వం కత్తి పెట్టింది. అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు నిలిపేసింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులపై కొర్రీలు పెట్టి.. బిల్లులు ఆపేసింది. దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పైగా పలు ఒత్తిళ్ల కారణంగా కాంట్రాక్టరు రావడం లేదని తెలుస్తోంది. జిల్లా విద్యార్థులతో పాటు ఇతర జిల్లాల వారికి ఎంతో ఉపయుక్తంగా ఉన్న వర్సిటీలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉమెన్స్‌, మెన్స్‌ హాస్టల్స్‌తో పాటు కనీసం క్యాంటీన్లు లేకపోవడంతో వేల మంది విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావంతో అడ్మిషన్లు బాగా తగ్గిపోయా యి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.

వర్సిటీ ప్రదాత వైఎస్సార్‌..

జిల్లా విద్యార్థుల ఉన్నత విద్య కోసం మహానేత వైఎస్సార్‌ కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. 2008లో మచిలీపట్నం సమీపంలో 104 ఎకరాల్లో నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. అడ్మినిస్ట్రేటివ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బ్లాక్‌తో పాటు అకడమిక్‌ బ్లాక్‌, ల్యాబ్‌, లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ తదితర భవనాలు నిర్మించారు. అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను పొందుతున్నారు.

రూ.51.19కోట్లు మంజూరు చేసిన వైఎస్‌ జగన్‌..

విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వర్సిటీలో సౌకర్యాల కోసం నిధుల మంజూరు చేశారు. వర్సిటీ నిధులతో విద్యార్థులకు రెండు వేర్వేరు హాస్టల్స్‌, ఫుడ్‌ కోర్టు, ఇంజినీరింగ్‌, ఫార్మసీ బ్లాక్‌లు, ఎంట్రన్స్‌ ఆర్చ్‌, ప్రహరీ నిర్మించేందుకు 2021లో రూ.51.19కోట్లకు అనుమతులు ఇచ్చారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న నూజివీడు పీజీ కళాశాలలో ఉమెన్స్‌ హాస్టల్‌, కొత్త అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

అడ్మిషన్లపై ప్రభావం..

క్యాంపస్‌ పీజీ కళాశాలలో తొమ్మిది డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. గతంలో ఉన్న తెలుగు, జర్నలిజం శాఖలు విద్యార్థులు లేక తొలగించారు. ఇప్పుడు 480 సీట్లు ఉండగా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు క్యాంపస్‌లో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థినులు.. కళాశాలలో ఉమెన్స్‌ హాస్టల్‌, కనీసం క్యాంటీన్‌ లేకపోవడం చూసి వెనక్కి వెళ్లిపోతున్నారని ప్రొఫెసర్లు చెబుతున్నారు. క్యాంపస్‌లో 2వేల మందికి పైగా విద్యార్థులు ఉండగా అనుబంధంగా 125 కళాశాలలు ఉన్నాయి.

అర్ధాంతరంగా ఆగిపోయిన ఫార్మసీ కళాశాల భవన నిర్మాణం

పనులు పూర్తి చేయాలి..

న్యూస్‌రీల్‌

భవనాలన్నీ పూర్తి చేయాలి..

పనులకు కూటమి బ్రేక్‌

గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది. రూ.51.19కోట్లతో ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) పనులు చేపట్టగా రూ.28.65కోట్ల పనులు పూర్తయ్యాయి. ఫుడ్‌ కోర్టుతో పాటు ఉమెన్స్‌ హాస్టల్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. నూజివీడులో కూడా పనులు తుది దశకు చేరాయి. అయితే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పనులకు మోకాలడ్డు పెట్టినట్లు సమాచారం. కొర్రీ పెట్టి, పనులకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో జూలై నుంచి కాంట్రాక్టర్లు రావడం లేదని తెలుస్తోంది.

పనుల వారీగా మంజూరైన నిధుల వివరాలు (రూ.కోట్లలో)..

రూ.51.19కోట్లు మంజూరు

చేసిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

రెండు హాస్టళ్లు, ఫుడ్‌ కోర్టు, ఫార్మసీ,

ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలు

మంజూరు

గతంలోనే రూ.28.65కోట్లు విడుదల

కూటమి ప్రభుత్వం రాకతో

ఆగిన పనులు

బిల్లులు విడుదల చేయకపోవడంతో

ముందుకు రాని కాంట్రాక్టర్‌

వసతుల్లేక చేరేందుకు ఆసక్తి చూపని

విద్యార్థులు

వర్సిటీ ఆవరణంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాల పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలి. హాస్టల్స్‌, ఫార్మసీ, ఇంజినీంగ్‌, క్యాంటీన్‌ భవనాల నిర్మాణాలపై నిర్లక్ష్యం తగదు. గతంలో హాస్టల్‌ లేని కారణంగా బయట ఉన్న ఇద్దరు విద్యార్థులు విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యారు. దీనిపై తాము చేసిన ఆందోళన ఫలితంగా మంచి వైద్యం అందించారు.

– ఎస్‌. సమరం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
కృష్ణాజిల్లా1
1/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా9
9/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా10
10/10

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement