సాక్షి స్పెల్ బీకి విశేష స్పందన
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా నిర్వహించిన స్పెల్ బీకి విశేష స్పందన లభించింది. ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో స్పెల్ బీ సెమీ ఫైనల్ టెస్ట్ ఆదివారం జరిగింది. ఈ పరీక్షకు పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.
నాలుగు కేటగిరీల్లో..
స్పెల్ బీకి హాజరైన విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్ష రాశారు. కేటగిరీ–1 లో 1, 2 తరగతి విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు స్పెల్ బీ సెమీఫైనల్ టెస్ట్ రాశారు. ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించి మొత్తం 278 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ స్పెల్‌బీ పరీక్ష ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతోందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వాఫే, అసోసియేట్ స్పానర్‌గా రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరిస్తోంది.
సెమీ ఫైనల్ పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
అవగాహన పెరిగింది..
స్పెల్ బీ టెస్ట్ ద్వారా ఇంగ్లిష్‌పై అవగాహన పెరిగింది. గతంలో ఇంగ్లిష్ అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్ బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్‌తో సహా నేర్చుకున్నా. ప్రస్తుతం ఏ సబ్జక్టయినా సునాయాసంగా చదవగలుగుతున్నా. థ్యాంక్స్ టు సాక్షి మీడియా.
– పి. నిహాల్ యాశ్విన్,
4వ తరగతి, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment