దుర్గగుడికి పోటెత్తిన భవానీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీమాలధారులు దుర్గగుడికి పోటెత్తారు. దుర్గమ్మ సన్నిధిలో దీక్షలు విరమించేందుకు తమిళనాడు, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. సోమ వారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 85 వేల మంది భవానీలు దీక్షలను విరమించారు. సోమవారం రాత్రి గిరి ప్రదక్షిణ పూర్తిచేసుకున్న భవానీలు అర్ధరాత్రికే క్యూలైన్లలోకి చేరుకుని దర్శనం కోసం వేచి ఉన్నారు. భవానీల రద్దీ అధికం కావడంతో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకే అమ్మవారి దర్శనం కల్పించారు. ఇరుముడులు సమర్పించే కౌంటర్లు, హోమగుండాలు, కనకదుర్గ నగర్‌లో ఎక్కడ చూసినా భవానీలే కనిపించారు.
వర్షంతో ఇక్కట్లు
మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కురిసిన వర్షంతో దీక్ష విరమణలకు విచ్చేసిన భవానీలు ఇబ్బందులకు గురయ్యారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు ఎక్కడా వేచి ఉండేందుకు ఏర్పాట్లు లేకపోవ డంతో వర్షం, చలిగాలులతో వణికిపోయారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ బుధవారం ఉదయం 11 గంటలకు యాగశాలలో జరిగే పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుందని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది.
మరో మారు మూలవిరాట్ వీడియో కలకలం
దీక్షల విరమణ మహోత్సవ వేళ మరో సారి అమ్మవారి వీడియో కలకలం సృష్టించింది. అమ్మను దర్శించుకునేందుకు హైదరాబాద్, బళ్లారి నుంచి విచ్చేసిన వేర్వేరు కుటుంబాల వారు అంతరాలయ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఏకంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమ్మవారి మూల విరాట్‌ను అతి దగ్గరగా వీడియో తీయడాన్ని ఆలయ సిబ్బంది, సెక్యూ రిటీ సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే ఆ రెండు కుటుంబాల వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని, విషయాన్ని డీఈఓ రత్నరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఇరు కుటుంబాలను విచారణ చేపట్టి, వారు తీసిన వీడియోలను ఫోన్ల నుంచి తొలగించారు. వీడియోను మళ్లీ రికవరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి పంపేశారు.
కీలక
విభాగాల్లో
ఈఓ
తనిఖీలు
నాలుగో రోజు రికార్డు స్థాయిలో
85 వేల మంది దీక్షల విరమణ
నేడు పూర్ణాహుతితో పరిసమాప్తం
లడ్డూ ప్రసాదాల తయారీ పోటు, అన్న ప్రసాదం తయారీ, ప్రసాద వితరణ, లడ్డూ విక్రయ కౌంటర్లు, హోమగుండాలతో పాటు ఇరుముడి పాయింట్లను ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి భవానీల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడా లని ఆలయ అధికారులను ఆదేశించారు. ఏడు లక్షలకు పైగా లడ్డూలు సిద్ధంగా ఉన్నాయని, భక్తులు ఎన్ని అడిగినా ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment