వినియోగదారుల చట్టంపై అవగాహన అవసరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అప్పుడే మోసాలను అరికట్టొ చ్చని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుడు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, అందుకు టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులకు, కన్స్యూమర్ వలంటరీ ఆర్గనైజేషన్ల సభ్యులకు అవార్డులు, జ్ఞాపికలు అందచేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనన్, జిల్లా వినియోగదారుల ఫోరమ్ చైర్మన్ చిరంజీవి, బీఐఎస్ జేడీ రమాకాంత్, సివిల్ సప్లయీస్ అధికారులు ప్రసాద్, పాపారావు, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్
Comments
Please login to add a commentAdd a comment