కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ

Published Wed, Dec 25 2024 2:16 AM | Last Updated on Wed, Dec 25 2024 2:16 AM

కృష్ణ

కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్‌ ఎస్‌.శర్మిష్ఠ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్‌ జి.గీతాబాయి విజయవాడ కార్పొ రేషన్‌ ప్రత్యేకవైద్యాధికారిగా నియమితులైన విషయం విదితమే. ఏలూరు జిల్లాలో డీఎం హెచ్‌ఓగా పనిచేస్తున్న శర్మిష్ఠను కృష్ణాజిల్లాకు బదిలీ చేశారు. తొలుత కలెక్టర్‌ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరించారు.

ఈవీఎం గోదాము

భద్రతకు పటిష్ట ఏర్పాట్లు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎంలు భద్రపరిచిన గోదాము భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోని మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో ఈవీఎంలను భద్రపరిచిన గోదామును మంగళవారం పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదామును క్షుణ్ణంగా తనిఖీచేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘా నికి అందజేస్తున్నామని తెలిపారు. ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వర్తించే పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పటిష్ట పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. తనిఖీ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

28 నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): విజయవాడ కేబీఎన్‌ కళాశాల వేదికగా ఈనెల 28, 29 తేదీల్లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం, విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాసభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహాసభలు జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంగణంగా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘మార్పు’ పేరుతో 500 పుటల ప్రత్యేక ప్రచురణను వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. కేబీఎన్‌ కళాశాల ఏఓ నారాయణరావు, డాక్టర్‌ జి.వి.పూర్ణచందు, గుత్తికొండ సుబ్బారావు పాల్గొన్నారు.

28 నుంచి సామవేదం ఆధ్యాత్మిక ప్రవచనాలు

విజయవాడ కల్చరల్‌: ఋషి పీఠం విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి జనవరి ఐదో తేదీ వరకు ప్రముఖ ఆధ్యా త్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ ‘మన కోసం.. మన పురాణ కథలు’ అంశంగా ప్రవచిస్తారని సమన్వయ కర్త డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో రోజూ సయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రవచనాలు సాగుతాయని పేర్కొన్నారు. ప్రవేశం ఉచితమని, భక్తులు నిర్వాహకులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, పారిశ్రామిక వేత్త తొండపు హనుమంతరావు, పాటిబండ సుందరరావు, అలమూరి అమర్‌నాథ్‌, శ్రీని వాస్‌ పాల్గొంటారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ1
1/3

కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ

కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ2
2/3

కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ

కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ3
3/3

కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ బాధ్యతలు స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement