ప్రజల సహకారంతో అదుపులో నేరాలు
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో నేరాలు అదుపు చేయడంలో ప్రజల సహకారం ఎంతో ఉందని ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక నేర సమీక్ష, నేర గణాంకాలపై సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ విస్తృతం చేయడంతో పాటు నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నమోదైన కేసులను పరిష్కరించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, మాదక ద్రవ్యాలు, గంజాయి, సైబర్ క్రైం నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వ హణ, వరదలను సమష్టిగా ఎదుర్కొన్నా మని వివరించారు.
2024లో జరిగిన నేరాలు ఇలా..
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు 5,264, శారీరక నేరాలు 1,073 కేసులు, ఆస్తి సంబంధిత నేరాలు 713, మహిళలపై నేరాలు 980, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 73 కేసులు, సైబర్ క్రైం కేసులు 100 నమోదయ్యాయని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. 249 చీటింగ్ కేసులు, 25 మాదకద్రవ్యాల కేసులు నమో దవగా 124 మందిని అదుపులోకి తీసుకొని 426.19 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 768 రహదారి ప్రమాదాల్లో 336 మంది మరణించగా 772 మంది క్షతగాత్రులుగా మారారని వివరించారు. 448 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.31,19,500 జరిమానా వసూలు చేశామని, మోటార్ వాహనాల చట్టం కింద 97,731 చలానాలకు రూ.3,35,86,465 జరిమానా వసూలు చేశామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమంలో మొత్తం 1,512 ఫిర్యాదులు రాగా అందులో 1,376 ఫిర్యా దులను పరిష్కరించామని తెలిపారు. లోక్ అదాలత్‌లో 11,014 కేసుల్లో రాజీ కుదిర్చా మన్నారు. 793 సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు వీటి ద్వారా 113 కేసులు ఛేదించా మని, ఏడు కేసులను అత్యంత చాకచ క్యంగా పరిష్కరించామని వివరించారు. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టంతో రూ.45 లక్షల విలువైన 390 మొబైల్ ఫోన్స్‌ను బాధితులకు అందించామన్నారు. మహిళల భద్రత కోసం 40 మందితో శక్తి టీం ఏర్పాటు చేసి, విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహణతో పోలీసుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఉల్లాసం కల్పించేందుకు కృషి చేసి నట్లు తెలిపారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించి, ప్రమాదాల్లో తలకు బలమైన దెబ్బ కారణంగానే మరణాలు నమోదయ్యాయని వివరించినట్లు చెప్పారు. సిబ్బంది సంక్షే మానికి చర్యలు చేపట్టి, మాస్టర్ హెల్త్ క్యాంపు నిర్వహించామని, ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిరక్షించే చర్యల చేపట్టామని పేర్కొన్నారు. మరణించిన సిబ్బందికి సంబంధించి రుణ మాఫీ, ఇన్సూరెన్స్ సొమ్ము వారి కుటుంబాలకు అందజేత, హోంగార్డులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీలు (అడ్మిన్) వి.వి. నాయుడు, సత్యనారాయణ (ఏఆర్) తదితరులు పాల్గొన్నారు.
కేసుల పరిష్కారానికి పటిష్ట చర్యలు ఎన్నికలు, వరదలను సమష్టిగా ఎదుర్కొన్నాం మాదక ద్రవ్యాలు, గంజాయి, సైబర్ క్రైంపై కఠిన చర్యలు వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ గంగాధరరావు
Comments
Please login to add a commentAdd a comment