చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో కౌలు రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు విరివిగా రుణాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమవేశం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గురువారం నిర్వహించారు. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో 71 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు జారీ చేసినప్పటికీ పంట రుణాలు మాత్రం 6 వేల మందికి మాత్రమే ఇవ్వటం చాలా నిరుత్సాహపరుస్తోందన్నారు. ఎక్కువ మంది కౌలు రైతులకు పంట రుణాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో సైబర్ ఆర్థిక నేరాలపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో బందరు ఎంపీ బాలశౌరి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రారెడ్డి, ఆర్బీఐ అధికారి నవీన్‌కుమార్, నాబార్డు జిల్లా మేనేజర్ మిళింద్‌చౌసాల్కర్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తాతాజీ, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్. వెంకట్రావు, టిడ్కో పీడీ బి. చిన్నోడు, ఉద్యానశాఖ అధికారి జె. జ్యోతి పాల్గొన్నారు.
బ్యాంకర్ల సమావేశంలో
కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment