పుస్తక పఠనంతో కొత్త ఆలోచనలు | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతో కొత్త ఆలోచనలు

Published Fri, Jan 3 2025 1:44 AM | Last Updated on Fri, Jan 3 2025 1:44 AM

పుస్తక పఠనంతో కొత్త ఆలోచనలు

పుస్తక పఠనంతో కొత్త ఆలోచనలు

చిలకలపూడి(మచిలీపట్నం): పుస్తక పఠనం ద్వారా కొత్త ఆలోచనలు, అనుభూతిని ఆస్వాదించవచ్చని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన లైబ్రరీని గురువారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పండుగలు, ముఖ్యమైన సందర్భాల్లో తనను కలవడానికి వచ్చినప్పుడు పుష్పగుచ్ఛాలు, మొక్కలు తదితరాలకు బదులుగా ఉపయోగపడే మంచి పుస్తకాలను కానుకలుగా అందించాలని, వాటి ద్వారా అవసరమైన వారు చదువుకునేందుకు వీలుగా ఈ లైబ్రరీలో భద్రపరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 286 పుస్తకాలు అధికారుల నుంచి వచ్చాయని వాటిని ప్రత్యేకమైన బీరువాల్లో భద్రపరచామన్నారు. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్‌లు తదితర విద్య సంబంధ ఉపకరణాలు అందించాలని, వాటిని సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అందజేస్తామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, ఉద్యానశాఖాధికారి జె. జ్యోతి, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయలక్ష్మి, కలెక్టరేట్‌ ఏవో సీహెచ్‌ ఆంజనేయ ప్రసాద్‌, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement