పెదకాకాని: పెదకాకాని శివాలయంలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. జిల్లా నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటిలో పొంగళ్ళు చేసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రభలతో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ఓం నమః శివాయ అని స్మరిస్తూ ప్రదక్షిణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అంత్రాలయ అభిషేకాలు, దర్శనాలు, ఏకవారాభిషేక పూజలు, తలనీలాలు సమర్పణ, నామకరణలు, అన్నప్రాసనలు, రాహుకేతు పూజలు, నవగ్రహ పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment