విలక్షణం.. కళల సమ్మేళనం
తరాలు మారినా మరువని సంస్కృతి అడవి బిడ్డలకే సొంతం. చెట్టూ చేమలను నమ్ముకొని సాగించే వారి జీవనం విలక్షణం. వారి సంప్రదాయాలు నేటికీ సజీవం. అలాంటి వారి కళలను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గిరిజన–ఆదివాసీ సమ్మేళనం పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం విజయవాడలో జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు వారి సంస్కృతి ప్రాభవాన్ని చాటి చెప్పాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment