ఫస్ట్ ఇంటర్ పరీక్షల రద్దు సరికాదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంటర్మీడియెట్‌లో ప్రస్తుతం అమలవుతున్న విధానాన్నే కొనసాగించాలని ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. విద్యాశాఖ ఇంటర్ విద్యలో సంస్కరణల పేరుతో చేస్తున్న మార్పులపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని శారద కళాశాలలో ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారంసెమినార్ జరిగింది. ఈ సెమినార్‌లో పాల్గొన్న విశ్రాంత అధ్యాపకులు, అధికారులు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అమల్లో విధానాన్నే కొనసాగించాలని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షను రద్దు చేసి, రెండో ఏడాది పబ్లిక్ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి అప్లికేషన్స్ దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో కూడా సిలబస్‌లో చేర్చాలన్నారు. ఒక సబ్జక్ట్‌లో ఫెయిలయ్యి మిగిలిన ఐదు సబ్జెక్టుల్లో పాస్ అయితే మొత్తంగా పాస్ అయినట్లు పరిగణించాలని సంస్కరణలు చేస్తున్నట్లు తెలిసిందని, దీని వల్ల ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ విలువ తగ్గిపోతుందని చెప్పారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాధా కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ఎల్.శ్రీధర్, కె.క్రిస్టోఫర్, ఫైనాన్స్ సెక్రటరీ ప్రభాకర్, సంపూర్ణరావు, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంటర్మీడియెట్ విద్య
పెన్షనర్స్ సంక్షేమ సంఘం
Comments
Please login to add a commentAdd a comment