కమనీయం.. కల్యాణోత్సవం
కోడూరు: ధనుర్మాసం ముగింపును పురస్కరించుకొని సోమవారం వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడ్డాయి. అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెంలో గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజీయర్ స్వామిజీ పర్యవేక్షణలో గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కోడూరులో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో గోదా కల్యాణాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఇస్మాయిల్‌బేగ్‌పేట, తూర్పువైపు రామాలయాల కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారి చిత్రపటాలను ఊరేగించి, అన్నసమారాధన నిర్వహించారు. బడేవారిపాలెం రామాలయం వద్ద గోదా కల్యాణాన్ని గ్రామస్తులు జరిపారు.
నిరుద్యోగ యువతకు సదావకాశం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పోగ్రామ్‌కు దరఖాస్తులు కోరుతున్నామని ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీ–ఫార్మసీ, బీబీఏ కోర్సులు పూర్తి చేసిన 21 నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. శిక్షణకు ఎంపికై న వారికి స్టైఫండ్ అందజేయడంతో పాటుగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా బీమా కవరేజ్ కూడా కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న వారు పీఎంఇంటర్న్‌షిప్.ఎంసీఏ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి ఈ నెల 21వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇతర వివరాలకు 93477 79032, 99888 53335, 87126 55686లో సంప్రదించాల్సిందిగా సూచించారు.
దుర్గమ్మకు కానుకగా వెండి నివేదన పాత్ర
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తులు సోమవారం వెండి నివేదన పాత్రను కానుకగా సమర్పించారు. గుంటూరుకు చెందిన చాయం రెడ్డి, శ్వేత, భవిత అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులను కలిసి అమ్మవారి నివేదనకు అవసరమైన వెండి పాత్రను బహూకరించారు. సుమారు 2.860 కిలోల వెండితో తయారు చేయించిన పాత్రను అమ్మవారి మహా నివేదన సమయంలో వినియోగించాలని దాతలు కోరా రు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేసవస్త్రాలతో దాతలను సత్కరించారు.
శాస్త్రోక్తంగా అమరేశ్వరునికి ఆరుద్రోత్సవం
అమరావతి: బాల చాముండికా సమేత అమరేశ్వరునికి సోమవారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం దాతల సహకారంతో సుమారు నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా వండి స్వామికి అభిషేకించారు. ఈ సందర్భంగా ఈఓ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ధనుర్మాసంలో అమరేశ్వరుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అన్నాభిషేకాన్ని నిర్వహించినట్టు వివరించారు. అనంతరం అభిషేకించిన అన్నాన్ని అన్నప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment