వైభవంగా గోదా రంగనాథుల కల్యాణం
విజయవాడ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలు సోమవారం ముగిశాయి. చివరి రోజు టీటీడీ అర్చకులు గోదా రంగనాథుల కల్యాణ క్రతువును ఘనంగా నిర్వహించారు. మురళీ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణ కత్రువు జరిగింది. మురళీస్వామి మాట్లాడుతూ గోదా కల్యాణం వీక్షిస్తే సర్వపాపాలు హరి స్తాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 400 మందికి టీటీడీ అధికారులు అన్న ప్రసాదం అందించారు. టీటీడీ దేవాలయ ఇన్‌స్పెక్టర్ లలితా రమాదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమరేశ్వరుని భోగిసేవ
అమరావతి: స్థానిక శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని గుడిలో సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం భోగి సేవ చేశారు. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. సోమవారం స్వామికి ఉదయాన్నే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయంలో సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భోగి రోజున స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment