రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం భోగి పండుగ నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు వాహనపూజలు చేసి మొక్కుబడులు సమర్పించుకున్నారు. గ్రామంతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ వెంకమ్మ తల్లి, శ్రీ వినుకొండ వెంకమ్మ తల్లి విగ్రహాలకు భోగి పండ్లను పోశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పి. ప్రియాంక పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment