ప్రజలు సుఖశాంతులు, సిరిసంపదలతో జీవించాలి
జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
గుడ్లవల్లేరు: ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక సోమవారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ శాంతులు, సిరి సంపదలతో జీవించాలనికోరారు. ధన, ధాన్య రాశులను నింపుకుని ఉమ్మడి జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు కార్యదర్శులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కార్యదర్శులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శిగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన కోలా ఉమామహేశ్వరరావు నియమితులయ్యారు. రాష్ట్ర దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా గుడివాడ నియోజకవర్గానికి చెందిన నీలాపు వెంకట మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షురాలిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పడిగపాటి చైతన్యరెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment