భూముల రీ సర్వే ప్రారంభం
కంచికచర్ల: పైలట్ ప్రాజెక్టులో భాగంగా నందిగామ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని ఏడు గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రారంభించినట్లు నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని గండేపల్లిలో రెవెన్యూ అధికారులు సోమవారం భూముల రీ సర్వేను చేపట్టారు. ఈ మేరకు ఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లోని భూములను ఇప్పటికే బ్లాకులుగా విభజించి రీ సర్వే ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రతి బ్లాక్‌లో 200 నుంచి 250 ఎకరాల భూమి రీ సర్వే చేస్తామని చెప్పారు. ప్రతి బ్లాకుకు ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, వీఆర్‌ఏలను బృందాలుగా నియమించామన్నారు. భూ యజమానులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హద్దుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రీ సర్వే చేసే సమయంలో భూ యజమాని భూమి వద్దకు రాకపోయినా వాట్సాప్ గ్రూప్ ద్వారా భూముల హద్దులు తెలియజేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన తర్వాత రాజముద్రతో క్యూఆర్ కోడ్‌తో కొత్త పాస్‌బుక్ జారీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.జాహ్నవి, వీఆర్వోలు కాంతారావు, రవికుమార్, రామారావు, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment