రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన పరికరాలను నాగాయలంక ఓఎన్‌జీసీ సంస్థ ప్రతినిధులు కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు ఎస్పీ సమక్షంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజలు కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణ, హెల్మెట్ వాడకం, సీట్ బెల్ట్ వినియోగం తదితర అంశాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసరావు, అవనిగడ్డ సీఐ జి.యువకుమార్, బందరు ట్రాఫిక్ సీఐ ఎ.వి.శివకుమార్, పలువురు ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment