వాయిద్య కళాకారుల పోస్టులు భర్తీ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వాయిద్య కళాకారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎల్.వి.చెన్నారావు కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మంగళవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంగీత వాయిద్య కళాకారుల సంఘం నూతన అధ్యక్షురాలు ఎస్.మీరాబీ, ఉపాధ్యక్షుడు వి.కృష్ణారావు, కార్యదర్శి కె.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఓ.సునీత, కోశాధికారి ఎం. నారాయణ, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గానికి టీడీపీ అధికార ప్రతినిఽధి నాగుల్‌మీరా, సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నారావు అభినందనలు తె లిపారు. సంఘం నూతన అధ్యక్షురాలు మీరాబీ, చెన్నారావు మాట్లాడుతూ వాయిద్య కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వాయిద్య పరికరాలు ఉచితంగా అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment