సెపక్ తక్రా క్రీడలను విజయవంతం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న అండర్ –14 బాలబాలికల సెపక్‌తక్రా జాతీయ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని డీఆర్వో లక్ష్మీ నరసింహం పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి 27 వరకు జరిగే సెపక్ తక్రా పోటీల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమస్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, నగరపాలకసంస్థ, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ క్రీడలకు 12 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్నారు. డీఈఓ సుబ్బారావు, స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ భానుమూర్తి రాజు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment