![కాపులను విస్మరించిన కూటమి ప్రభుత్వం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09vic162-310137_mr-1739129119-0.jpg.webp?itok=EqvmkrEq)
కాపులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాపులను పట్టించుకోవడం లేదని ఆల్ ఇండియా కాపు జేఏసీ కన్వీనర్ గొర్రె అర్జున్‌రావు అన్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కోరిన మీదట కూటమికి మద్దతు ఇచ్చి గెలిపించామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆల్ ఇండియా కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కన్వీనర్ అర్జున్‌రావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా కాపులకు చేసిందేమీ లేదన్నారు. కాపులకు నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో కాపు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో కింద స్థాయి ఎస్పీని బలి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాపులు కోల్పోయిన రిజర్వేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాపుల సమస్యలపై త్వరలో సీఎంను కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలా తారక రామారావు మాట్లాడుతూ విజయవాడ కేంద్రంలో ఏర్పాటైన జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కాపు విద్యార్థులకు విదేశీ విద్యకు నిధులు కేటాయించాలన్నారు. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాలు చేయడానికి వెనకాడబోమన్నారు. సమావేశంలో కాపు జేఏసీ నేతలు వాద ప్రసాద్‌రావు, సంకటి లక్ష్మణరావు, కత్తి చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా కాపు జేఏసీ
Comments
Please login to add a commentAdd a comment