![12న కస్టమ్స్ వాకథాన్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/14141ff_mr-1739129119-0.jpg.webp?itok=uFZH_kVv)
12న కస్టమ్స్ వాకథాన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న 5కే వాక్‌థాన్, రన్ నిర్వహిస్తున్నట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. ఈ రన్, వాక్‌థాన్‌లో విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్ రాష్ట్ర కార్యాలయ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆటోనగర్‌లోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమంలో వయస్సును బట్టి, వివిధ వయో వర్గాలకు అనుగుణంగా రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ కాకరాల ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment