![ఘాట్‌రోడ్డులో ఢీకొన్న బస్సు, కారు - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/24sri54a-200086_mr_0.jpg.webp?itok=m4ZkDwt7)
ఘాట్‌రోడ్డులో ఢీకొన్న బస్సు, కారు
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో సోమవారం బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘాట్‌రోడ్డులోని సర్వనరసింహస్వామి ఆలయం వద్ద మలుపు ఉంది. దీనికి సమీపంలో విజయవాడ వైపు వెళ్తున్న నంద్యాల డిపోకు చెందిన బస్సు, గిద్దలూరు వైపు నుంచి వస్తున్న స్విఫ్ట్ కారు ఎదురెదురై ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో వస్తున్న అనంతపురం పట్టణానికి చెందిన డ్రైవర్ హజీ, ఖలందర్‌తో పాటు మరొకరు గాయపడ్డారు. వీరు గుంటూరులో కారు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ దస్తగిరి ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్ చేయబోవడంతో పాటు మలుపు ఉండటంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న రోడ్ సేఫ్టీ పోలీసులు పీరయ్య, శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అప్పటికే గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. శిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని మహానంది పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment