![డోన్ కేంద్రంగా రేషన్‌బియ్యం అక్రమ రవాణా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09dhn81a-200041_mr-1739131255-0.jpg.webp?itok=VaQZHR4w)
డోన్ కేంద్రంగా రేషన్‌బియ్యం అక్రమ రవాణా
డోన్: కూటమి నేతులు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు డోన్‌ను అడ్డాగా చేసుకున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుంకయ్య ఆరోపించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల వ్యవధిలోనే ఆ పార్టీ నాయకులు పేదల కడుపు కొట్టి రేషన్ బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు రవాణా చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేల అనుచరులు కూటమిగా ఏర్పడి డోన్‌ను కేంద్రంగా చేసుకొని రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నా విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమార్కులంతా కలిసి ప్రతిరోజు 3 నుంచి 4 లారీల రేషన్ బియ్యం డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేసి గుత్తి రోడ్డులో గోడౌన్‌ను డంప్ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు. సమావేశంలో పట్టణ కార్యదర్శి మోటా రాముడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment