![‘గుర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09ymr22-200087_mr-1739131254-0.jpg.webp?itok=OrnXRMKm)
‘గుర్తు’కొస్తున్నాయి..
ఎమ్మిగనూరురూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 1997నుంచి 2004 వరకు చదివిన పూర్వపు విద్యార్థులు అపూర్వ గుర్తును ఏర్పాటు చేశారు. ‘ఐలవ్ జెఎన్‌వీ కర్నూలు’ అని ఏర్పాటు చేసిన గుర్తును ఆదివారం ప్రిన్సిపాల్ ఇ. పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పూర్వపు విద్యార్థులు వివిధ పనుల్లో స్థిరపడి విద్యాలయాన్ని మరవకుండా అభివృద్ధికి కృషి చేస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. నవోదయలో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నారని తెలిపారు. పూర్వపు విద్యార్థి రాజంపేట జడ్డి ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తాము చదువుకున్న విద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. పూర్వపు విద్యార్థుల సమ్మేళనం ప్రతి సంవత్సరం జరిగితే బాగుంటుందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ఇ.పద్మావతికి శాలువాకప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హుసేన్‌బాషా, పూర్వపు విద్యార్థి సెక్రటరీ బసవరాజ్, కో–ఆర్డినేటర్ శివరాముడు, రమేష్‌సాగర్, 11వ బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు.
![‘గుర్తు’కొస్తున్నాయి..1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09ymr22a-200087_mr-1739131254-1.jpg)
‘గుర్తు’కొస్తున్నాయి..
Comments
Please login to add a commentAdd a comment