పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఏడోవ గేటు నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వకు 500 క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వకు 1,500 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల సమయానికి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 851అడుగుల నీటిమట్టం నమోదైంది.
మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో జిల్లా జట్టు చాంపియన్
కర్నూలు (టౌన్ ): ఈనెల 7 నుంచి 9 వరకు అనంతపురం పట్టణంలోని పీటీసీ క్రీడా మైదానంలో నిర్వహించిన 43 వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా జట్టు సత్తాచాటింది. 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల రిలే పరుగు, డిస్కస్ త్రో వంటి క్రీడాంశాల్లో జిల్లా జట్టుకు 32 బంగారు పతకాలు, 29 వెండి పతకాలు, 41 కాంస్య పతకాలు సాధించినట్లు మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పాండు రంగారెడ్డి, రవికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫుట్‌బాల్ విజేత బీక్యాంపు జట్టు
కర్నూలు (టౌన్): జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో బి.క్యాంపు జట్టు విజేతగా నిలిచింది. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. విజేతగా నిలిచిన జట్టుకు కర్నూలు టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్ కప్పు అందజేశారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు, సభ్యులు ముప్పా రాజశేఖర్, పాల్ విజయ్‌కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
Comments
Please login to add a commentAdd a comment