మంత్రాలయం: చెట్నహళ్లి గ్రామంలో శ్మశాన వాటిక విషయంలో ఆదివారం మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మృతి చెందగా శ్మశానంలో ఖననం చేసేందుకు కొందరు వెళ్లారు. వారితో మరో వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. విషయం తెలుసుకున్న మంత్రాలయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. శ్మశానంలో మృతదేహానికి అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా శ్మశాన విషయమై ఇరువర్గాలు మధ్య ఘర్షణ నెలకొనగా.. ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment