![45 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10knl13-200002_mr-1739215835-0.jpg.webp?itok=1rfrZgfP)
45 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి
కర్నూలు (సెంట్రల్): రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, గ్రేడ్1 వీఆర్వోలకు ఎట్టకేలకు పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ పి.రంజిత్ బాషా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 45 మందికి పదోన్నతి కల్పించగా అందులో 20 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 23 మంది గ్రేడ్–1 వీఆర్‌ఓలు ఉన్నారు. వీరిలో 20 మందిని నంద్యాల జిల్లాకు, 25 మందికి కర్నూలు జిల్లాకు కేటాయించారు. త్వరలోనే వారికి స్థానాలను కేటాయించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: కర్నూలు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చె ప్పి అనంతపురం పట్టణానికి చెందిన సాధిక్ వలి రూ.4 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేశాడని కర్నూలు విద్యానగర్‌కు చెందిన సందీప్ చంద్రపాల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 113 ఫిర్యాదులొచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
●తన కుమారుడు సురేష్‌కు కెనడాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి పంపిస్తామని రూ.1.06 లక్షలు కట్టించుకుని ఢిల్లీకి చెందిన ఆశా ఠాకూర్ మోసం చేశారని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ఎస్పీకి విన్నవించారు
● ఆస్తికి సంబంధించిన విషయంలో గొడవ పడి తన భర్త మధు మూడేళ్ల కుమారుడిని తీసుకెళ్లాడని, తిరిగి ఇప్పించాలని కర్నూలు మండలం ఉల్చా లగ్రామానికి చెందిన ప్రమీలమ్మ ఫిర్యాదు చేశారు.
● ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు
● పీజీఆర్‌ఎస్‌కు 113 ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment