![స్టేట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10knl14-200008_mr-1739215833-0.jpg.webp?itok=SLAATHZO)
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పోస్టుల మెరిట్ జాబి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి 10 కేట గిరీల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు గతేడాది జనవరి 29వ తేదీన జారీ చేసిన నో టిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశామని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని కర్నూ లు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్‌సైట్‌లు https://kurnool.gov.in, https://nandyal.ap .gov.in, https://kurnoolmedicalcollege. ac.in లలో అప్‌లోడ్ చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు వారి వివరాలను సరిచూసుకుని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11వ తేది నుంచి 15వ తేది సాయంత్రం 5 గంటల్లోపు కళాశాలలోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలన్నారు.
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా
తీర్చిదిద్దుదాం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని 434 రెవెన్యూ గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేద్దామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బీ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో జేఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 93 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ మోడల్‌గా చేశామని, మిగిలిన 341 గ్రామాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకొని లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా చేతి పంపులు, పీడబ్ల్యూఎస్, పైప్‌లైన్ల రిపేర్లు తదితర వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. సమావేశంలో పీఏ టు ఎస్‌ఈ, కర్నూలు డీఈఈ వీ అమల తదితరులు పాల్గొన్నారు.
మరింత పడిపోయిన
పంటల ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): వాము, కందులు, ఎండుమిర్చితదితర పంటల ధరలు మరింత పడిపోయాయి. సోమవారం కర్నూ లు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఎండుమిర్చి భారీగా వచ్చింది. 836 క్వింటాళ్లు రా గా.. కనిష్ట ధర రూ.1294, గరిష్ట ధర రూ. 13,200 లభించింది.సగటు ధర రూ.9,099 మాత్రమే నమోదైంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. వాము ధర కూడా పడిపోయింది. ఇటీవల రూ.26 వేల వరకు వెళ్లిన ధర తాజాగా గరిష్ట ధర రూ.23,511 మాత్రమే లభించింది. సగటు ధర రూ.9,899 నమోదైంది. వేరుశనగ ధర కూడా పడిపోయింది. రబీలో పండించిన వేరుశనగ మార్కెట్‌కు వస్తోంది. కనిష్ట ధర రూ.3,885, గరిష్ట ధర రూ.6,120 లభించగా..సగటు ధర రూ.5,209 నమోదైంది. అలాగే మార్కెట్‌కు 2,280 క్వింటాళ్ల కందులు రాగా కనిష్ట ధర రూ.1,810, గరిష్ట ధర రూ.7,511 లభించగా సగటు ధర రూ.7301 పలికింది. సజ్జలు, కొర్రలు తదితర పంటల ధరలు కూడా పడిపోయాయి.
డీఐజీని కలిసిన
కమాండెంట్
కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్ కమాండెంట్ ఎం.దీపిక పాటిల్ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా కాకినాడ ఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న దీపిక పాటిల్ ఇటీవల కర్నూలు రెండో బెటాలియన్ కమాండెంట్‌గా విధుల్లో చేరారు. సోమవారం కర్నూలు బీక్యాంప్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి డీఐజీకి పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
![స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పోస్టుల మెరిట్ జాబి1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10knl32-200002_mr-1739215833-1.jpg)
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పోస్టుల మెరిట్ జాబి
Comments
Please login to add a commentAdd a comment