2014–15 నుంచి 2018–19 మధ్య ఉన్న పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. నాటి టీడీపీ పాలనలో చంద్రన్న బీమా ఉన్న వారు వేలాది మంది అసువులు బాసినప్పటికీ నాటిప్రభుత్వం నుంచి లభించిన భరోసా నామ మత్రమే. బీమా ఉన్న వారు మృతిచెందితే వారి వారసులు పరిహారం పొందాలంటే ఏళ్లు గడిచేవి. భరోసా లభించక బాధిత కుటుంబాల సభ్యులు అనేక ఇబ్బందులు పడేవారు. నాటి ఐదేళ్లలో మృతిచెందిన వారి కుటుంబాల్లో 50 శాతం మంది కూడా బీమా దక్కలేదు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చంద్రన్న బీమా అమలులో తీవ్ర జాప్యం చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.38 లక్షల రైస్‌కార్డులు ఉండగా...10.25 లక్షల కటుంబాలకు గత ప్రభుత్వం వైఎస్‌ఆర్ బీమా కల్పించింది. కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రన్న బీమాను ఇంతవరకు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
నిరాశే మిగిలింది
ఎన్నికల కోడ్ 2024 మార్చి నెల 18 నుంచి వచ్చింది. నాటి నుంచి వైఎస్‌ఆర్ బీమా కింద రిజిస్ట్రేషన్‌లు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం ఆగిపోయింది. జూన్ 12 నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వెంటనే వైఎస్‌ఆర్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలులో వేగం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు, సహజ మరణాలకు రూ.5 లక్షలు పెంచుతూ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో నిరాశే మిగిలింది.
నాటి పరిస్థితులే
పునరావృతం
Comments
Please login to add a commentAdd a comment