![ప్రారంభమైన ఘంటసాల పాటల పండుగ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09knl32a-200097_mr-1739131256-0.jpg.webp?itok=sr7pzKZ9)
ప్రారంభమైన ఘంటసాల పాటల పండుగ
కర్నూలు కల్చరల్: ఘంటసాల గాన కళా సమితి, టీజీవీ కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో సీక్యాంప్ కళాక్షేత్రంలో ఆదివారం ఘంటసాల పాటల పండుగ ప్రారంభమైంది. ఘంటసాల ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తిఓబులయ్య, ఘంటసాల గాన కళా సమితి అధ్యక్షుడు బీఎస్ రావు మాట్లాడుతూ తెలుగు వారు ఉన్నంత కాలం ఘంట సాల గానం చేసిన భగవద్గీత ఉంటుందన్నారు. అనంతరం గాయకులు హబీబ్, శ్రీనివాసులు, సుధారాణి, చంద్రకంటి మద్దయ్య ఘంటసాల పాడిన పాటలను పాడి అలరించారు. డాక్టర్ ఉమా నాథ్, డాక్టర్ నగేష్, ఘంటసాల గాన సభ అధ్యక్షుడు సుస్వరం వాసుదేవయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కేజీ గంగాధర్‌రెడ్డి, సత్య ప్రసాద్‌లు గాయకులను సన్మానించారు. కార్యక్రమంలో కళాక్షేత్రం పధాన కార్యదర్శి మహమ్మద్ మియ్యా, సభ్యులు, బాలవెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment